: గృహ నిర్బంధంలో వేర్పాటు వాద నేత ఉమర్ ఫరూఖ్


జమ్మూకాశ్మీర్ లో వేర్పాటు వాది, హురియత్ కాన్ఫరెన్స్ నేత ఉమర్ ఫరూఖ్ ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకాశ్మీర్ పర్యటన సందర్భంగా ఆ రాష్ట్ర పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆయనను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆయనతో పాటు ఆయన మద్దతుదారులు, అనుమానితులు వంద మందిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కాగా, నవంబర్ 7న ప్రధాని మోదీ కాశ్మీర్ లో పర్యటించనున్నారు. ఆయన పర్యటనను అడ్డుకుంటామని వేర్పాటు వాద నేతలు పిలుపునివ్వడంతో ముందస్తు భద్రతా ఏర్పాట్లలో భాగంగా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News