: వరంగల్ ఉపఎన్నికకు 31 నామినేషన్లు దాఖలయ్యాయి: ఎన్నికల సంఘం
వరంగల్ లోక్ సభ ఉపఎన్నికకు నామినేషన్ల దాఖలుకు గడువు నేటితో ముగిసింది. ఈ ఎన్నికకు మొత్తం 31 నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఈ నామినేషన్లను రేపు పరిశీలించనున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ఈ నెల 7వరకు గడువుంది. ఈ నెల 21న పోలింగ్ జరగనుండగా, 24న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. చివరి రోజైన నేడు సిరిసిల్ల రాజయ్య అనూహ్యంగా బరి నుంచి తప్పుకోవడంతో సర్వే సత్యనారాయణ పేరును కాంగ్రెస్ ప్రకటించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ తరపున కొండేటి శ్రీధర్, విజయరామారావులు నామినేషన్లు వేశారు. ఆ తరువాత సర్వే పార్టీ అధికార అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.