: పాకిస్థాన్ తోను, ముస్లింలతోను మోదీకి ఏంటి సమస్య?: పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్


‘భారత్ లో కొత్త ప్రధాని వచ్చారు. పాకిస్థాన్ తో, ముస్లింలతో ఆయనకు ఉన్న సమస్యేమిటో నాకు అర్థం కావట్లేదు’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ వ్యాఖ్యలు చేశారు. ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడారు. ‘భారత్- పాకిస్థాన్ ల మధ్య సరైన వాతావరణం లేకపోవడం అనేది ఆయా అధికార పార్టీలకు సంబంధించిన అంశం కాదు. ఇది ‘ఇండివిజ్యువల్’ గా ఫీలవడం వల్ల వస్తున్న సమస్య. భారత మాజీ ప్రధాని వాజ్ పేయి చాలా సాధారణంగా ఉండే చాలా మంచి వ్యక్తి. సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఆయన సిన్సియర్ గా పనిచేశారు. సోనియా గాంధీ కూడా కొంతవరకు అదే మార్గంలో నడిచారు’ అని ముషారఫ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News