: భజ్జీ, యువీ! మొహమాటపడకుండా నన్నడగండి...సెహ్వాగ్ తుంటరి ట్వీట్
వీరేంద్ర సెహ్వాగ్ ఆటలో ఎంత దూకుడుగా ఉంటాడో...చెప్పాల్సింది చెప్పడంలోనూ అంతే సూటిగా చెబుతాడు. మనసులో ఏదీ దాచుకోని సెహ్వాగ్ అంటే అతని సహచరులందరికీ ఎంతో అభిమానం. సచిన్ సమకాలీనుడిగా ఉండి కూడా ప్రతిభను చాటుకున్న సెహ్వాగ్, కొత్త పెళ్లి కొడుకు హర్భజన్ సింగ్ కు, త్వరలో పెళ్లి చేసుకుంటానని ప్రకటించిన యువరాజ్ సింగ్ కు సలహా ఇచ్చాడు. వైవాహిక జీవితంలో స్ట్రెయిట్ డ్రైవ్ ఆడడం ఎలాగో తెలుసుకోవాలంటే ఎలాంటి మొహమాటం లేకుండా అడగండంటూ ట్వీట్ చేశాడు. దీనికి హర్భజన్ సమాధానమిస్తూ 'అలాగే గురూజీ' అని పేర్కొన్నాడు. కాగా, వీరంతా సీనియర్లు, జూనియర్లనే భావం లేకుండా ఆటపట్టించుకుంటుంటారు.