: భువనేశ్వరి కుటుంబాన్ని చూసి పురంధేశ్వరి ఓర్వలేకపోతున్నారు: ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైర్


ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీజేపీ నేతలు పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావులు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఏజెంట్లుగా పనిచేసిన వీరు... ఆ పార్టీలో అనేక పదవులు అనుభవించి ఇప్పుడు బీజేపీలో చేరారని విమర్శించారు. సొంత సోదరి భువనేశ్వరి కుటుంబాన్ని చూసి ఓర్వలేకే పురంధేశ్వరి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వెంకన్న ధ్వజమెత్తారు. వారాల చొప్పున ఇళ్లలో భోజనాలు చేసిన కావూరి వేల కోట్ల రూపాయలను ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఆస్తి ఎంత? ఇప్పుడు ఉన్న ఆస్తి ఎంత? అని నిలదీశారు. బీజేపీ నేత సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి చంద్రబాబు పెట్టిన భిక్ష అని ఎద్దేవా చేశారు. మంత్రి పదవి కోసమే సోము వీర్రాజు అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. మిత్రపక్షమైన బీజేపీపై ఆరోపణలు చేయవద్దని తమ అధినేత చంద్రబాబు చెప్పడం వల్లే తాము సైలెంట్ గా ఉన్నామని... ఇకపై నోరు జారీతే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News