: 'సర్దార్... గ్యాంగ్'...పవన్ కల్యాణ్ సెల్ఫీతో బ్రహ్మాజీ సందడి


ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. అయితే సినిమాకు సంబంధించిన విశేషాలేవీ మీడియాలో రాకుండా చిత్రయూనిట్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలో 'గ్యాంగ్ ఈజ్ బ్యాక్... సర్దార్ గ్యాంగ్' అంటూ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తన అధికారిక ఫేస్ బుక్ పేజ్ లో పవన్ కల్యాణ్, అలీతో కలిసి దిగిన సెల్ఫీని పోస్టు చేశాడు. లైకులు, షేర్లతో ఈ ఫోటోకు అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. కాగా, ఈ మధ్యకాలంలో గడ్డం లేకుండా పవన్ కల్యాణ్ ఫోటోలో కనువిందు చేయడం విశేషం.

  • Loading...

More Telugu News