: నామినేషన్ దాఖలు చేసిన సర్వే సత్యనారాయణ


వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వే సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. తన నివాసంలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఆయన కోడలు, మనవళ్లు మృతి చెందిన నేపథ్యంలో, తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని రాజయ్య కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. ఈ క్రమంలో, రాజయ్య స్థానంలో సర్వే సత్యనారాయణను తమ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపిక చేసింది. దీంతో, సర్వే నామినేషన్ వేశారు. నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ రోజే ఆఖరి రోజు.

  • Loading...

More Telugu News