: హైదరాబాద్ లో నేరస్థుల వివరాల సేకరణకు ఇంటింటి సర్వే: సీపీ మహేందర్ రెడ్డి
జంటనగరాల్లోని పాత నేరస్థుల వివరాల సేకరణ కోసం సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు. 2011 నుంచి పాత నేరస్థులకు చెందిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామని విలేకరుల సమావేశంలో చెప్పారు. మొత్తం 11,500 మంది పాత నేరస్థులున్నారని, అలాగే ఒక్క హైదరాబాద్ లోనే 7,500 మంది పాత నేరస్థులు ఉన్నారని కమిషనర్ వివరించారు. నగరంలో నేరాలను అరికట్టేందుకు ఈ సర్వే బాగా ఉపయోగపడుతుందని మహేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.