: దీపావళికి ఎలాంటి బహుమతులు ఇవ్వకండి... చేతిరాత ప్రకటనతో ఢిల్లీ మంత్రుల విన్నపం


ప్రభుత్వ విభాగాలన్నింటిలోనూ అవినీతి తగ్గుముఖం పట్టేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్నిస్తున్నాయి. ఇటీవల సీఎంఎస్-ఐసీఎస్ సర్వేలో, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో అవినీతి తగ్గుముఖం పట్టిందని 45 శాతం అభిప్రాయపడినట్టు తెలిసింది. ఇంకా చాలా ప్రభుత్వ విభాగాల్లో అవినీతి అలాగే కొనసాగుతోందని అన్నారట. ఈ క్రమంలో అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టేందుకు మంత్రులే సొంతంగా కార్యాచరణ రూపొందించుకోవాలని ఇటీవల కేజ్రీ సూచించారు. ఈ నేపథ్యంలో మంత్రులు కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. "ప్లీజ్! దీపావళి పండుగ సందర్భంగా మాకు బహుమతులు ఇచ్చి ఇబ్బందిపెట్టకండి. కానుకలు ఏవీ మేం తీసుకోం" అంటూ కాగితంపై చేతితో రాసి తమ కార్యాలయాల బయట అతికించారు.

  • Loading...

More Telugu News