: బీహారులో కలకలం రేపుతున్న బీజేపీ 'ఆవు' యాడ్!


'గోమాంసం' రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. గతంలో బీఫ్ పై నితీష్, లాలూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, బీజేపీ పలు దినపత్రికల్లో నేడు ప్రచురించిన యాడ్ పెను వివాదానికి తెర లేపింది. మరికొన్ని గంటల్లో బీహారులో తుది దశ పోలింగ్ ప్రారంభం కానున్న సమయంలో ప్రచురితమైన ఈ యాడ్ పై మహాకూటమి నేతలు భగ్గుమన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను లక్ష్యం చేసుకుంటూ "చీఫ్ మినిస్టర్, మీ భాగస్వామ్య నేతలు పదేపదే పవిత్రమైన ఆవును హేళన చేస్తున్నారు. మీరు మౌనంగా ఉన్నారు" అని ఈ ప్రకటనలో బీజేపీ ఆరోపించింది. 'ఇక ఓటు బ్యాంకు రాజకీయాలు మాని, వారి ప్రకటనలకు కట్టుబడ్డారా? లేదా? అన్న విషయాన్ని తెలపండి' అని బీజేపీ ప్రకటనలో ఉంది. బీఫ్ అన్న పదాన్ని ఎరుపు రంగులో హైలెట్ చేస్తూ, రఘువంశ ప్రసాద్ సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్, సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలనూ యాడ్ లో ప్రచురించారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న మహాకూటమి నేతలు, విషయాన్ని ఈసీ ముందు పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News