: వరంగల్ అభ్యర్థిని మార్చే పనిలో టి.కాంగ్రెస్... బీఫాంతో వరంగల్ కు బయలుదేరిన ఉత్తమ్


వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ఇంట్లో అనూహ్య ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో అభ్యర్థిని మార్చేందుకు పార్టీ సిద్ధమైంది. ఈ క్రమంలో టీ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాళీ బీఫాంతో వరంగల్ కు బయలుదేరారు. జిల్లా నేతలతో చర్చించి అక్కడే అభ్యర్థిని నిర్ణయించనున్నారు. దాంతో అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ నేతల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. నేటితో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుండటంతో మధ్యాహ్నంలోగా కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించనుంది. అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పార్టీ నేత రాజయ్య ఇంట్లో జరిగిన ఘటన విషాదకరమన్నారు. ఇందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని, రాజయ్య అభ్యర్థిత్వాన్ని విరమించుకుంటున్నట్టు చెప్పారు. అయితే ఒక రకంగా ఈ ఘటన పార్టీకి షాక్ వంటిదని, ఇలా జరగడం కాంగ్రెస్ కు పెద్ద ఎదురుదెబ్బని పేర్కొన్నారు. సర్వే సత్యనారాయణ పేరు పరిశీలనకు వచ్చినా, పోటీ చేయడానికి ఆయన ఇప్పుడంత సుముఖంగా లేరని తెలిపారు.

  • Loading...

More Telugu News