: కర్ణాటక ముఖ్యమంత్రికి పంది మాంసం పంపిస్తాం: శ్రీరామసేన
దేశంలో నెలకొన్న మత అసహనంపై మాట్లాడుతూ, అవసరమైతే తాను కూడా గొడ్డు మాంసం తింటానని ప్రకటించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై శ్రీరామసేన వ్యవస్థాపకులు ప్రమోద్ ముతాలిక్ ధ్వజమెత్తారు. ప్రమాణస్వీకారం చేసే సమయంలో గోరక్షణ చేస్తానని ప్రకటించిన సిద్ధరామయ్య ఇప్పుడు గోరక్షణను గాలికి వదిలేశారని... రాజకీయ లబ్ధి కోసం గోమాంస భక్షణపై అనవసర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గొడ్డు మాంసం తింటానంటున్న సిద్ధరామయ్య పంది మాంసం కూడా తింటారా? అని ప్రశ్నించారు. తింటానంటే, ఒక కేజీ పంది మాంసాన్ని శ్రీరామసేన పంపిస్తుందని అన్నారు. విజయపురలో పర్యటించిన సందర్భంగా ప్రమోద్ ముతాలిక్ ఈ వ్యాఖ్యలు చేశారు.