: వరంగల్ బైపోల్స్ ఖర్చు రూ.7 కోట్లు... నిధులు విడుదల చేసిన భన్వర్ లాల్
తెలంగాణ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కడియం శ్రీహరి అప్పటిదాకా తాను ప్రాతినిధ్యం వహించిన వరంగల్ లోక్ సభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించక తప్పలేదు. అయితే శ్రీహరి నిర్ణయంతో ప్రభుత్వ సొమ్ము అక్షరాలా రూ.7 కోట్లకు పైగా వృథా అవుతోంది. ప్రస్తుతం వరంగల్ ఉప ఎన్నికకు నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇక ఈ ఎన్నికల నిర్వహణకు రూ.7 కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు నిన్న ఎన్నికల కమిషన్ సీఈఓ భన్వర్ లాల్ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రూ.7 కోట్లకు అదనంగా మరో రూ.4 లక్షలను ఎన్నికల సిబ్బంది ఖర్చుల కోసం విడుదల చేశారు.