: సఫారీలకు గట్టిపోటీ ఇస్తాం: రవిశాస్త్రి


టెస్టు సిరీస్ లో సౌతాఫ్రికాకు టీమిండియా గట్టి పోటీ ఇస్తుందని మాజీ క్రికెటర్, ప్రస్తుత జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి తెలిపాడు. మొహాలీలో ఆయన మాట్లాడుతూ, 2006 నుంచి విదేశీ గడ్డపై ఓటమే ఎరుగని సౌతాఫ్రికాను ఎదుర్కోవడం సవాలేనని అన్నాడు. ఆతిథ్య దేశం తనకు నచ్చిన పిచ్ ను తయారు చేసుకునే స్వేచ్ఛ ఉందని రవిశాస్త్రి తెలిపాడు. టెస్టుల్లో విజయం సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని చెప్పాడు. అశ్విన్ తొలి టెస్టులో ఆడుతాడని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. అశ్విన్ పూర్తిగా కోలుకున్నాడని, సఫారీలను అడ్డుకునేందుకు స్పిన్ అస్త్రాన్ని ప్రయోగిస్తామని పేర్కొన్నాడు. కాగా, తమను ఎదుర్కొనేందుకు భారత్ స్పిన్ ప్రయోగించనుందని డుప్లెసిస్ ఇప్పటికే చెప్పాడు.

  • Loading...

More Telugu News