: పుస్తకం భారత్ లో...ఆవిష్కరించింది పాకిస్థాన్ లో !


పాకిస్తాన్ కు చెందిన కన్ జా జావీద్ అనే అమ్మాయి ఒక పుస్తకం రాసింది. ఆ పుస్తకాన్ని మన దేశంలోని ఉత్తరఖండ్ రాష్ట్రంలో జరుగుతున్న కుమాన్ లిటరరీ ఫెస్టివల్ లో ఆవిష్కరించాలనుకుంది. అయితే, పాకిస్థానీ కళాకారులు ఇటీవల మనదేశానికి వచ్చినప్పుడు జరిగిన సంఘటనల దృష్ట్యా ఆమె వీసా రద్దయింది. దీంతో ఏం చేయాలో జావీద్ కు తోచలేదు. చివరకు ఒక నిర్ణయానికి వచ్చింది. పాకిస్తాన్ లోని తన ఇంట్లో నుంచే పుస్తకావిష్కరణ చేయాలనుకుంది. ఇంకేముంది, ఉత్తరాఖండ్ లో ఉన్న పుస్తకాన్ని స్కైప్ ద్వారా ఆమె ఆవిష్కరించింది. ఇంతకీ, ఆ పుస్తకం పేరు 'ఆషెస్ వైన్ అండ్ డస్ట్'. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘నాకు వీసా రద్దయిందన్న వార్తతో చాలా బాధపడ్డాను. ఏడుపొచ్చేసింది. నన్ను అవమానపరిచినట్లుగా భావించాను. అయితే, నేను ఆవిష్కరణ వేదిక వద్దకు వెళ్లలేకపోయినా, స్కైపు ద్వారా ఆవిష్కరించాను’ అని కన్ జా జావీద్ పేర్కొంది.

  • Loading...

More Telugu News