: మన దేశంలో పనిచేస్తున్న మహిళలు తక్కువే!


భారతదేశంలో మహిళలు తక్కువగా పనిచేస్తుండటంతో దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతోందట. ఈ విషయాన్ని మెక్ నీ నివేదిక వెల్లడించింది. మనదేశంలో పనిచేస్తున్న స్త్రీల శాతం కేవలం 31 శాతం మాత్రమే. 2025 నాటికి 41 శాతం మంది స్త్రీలు పనిచేస్తారని ఈ నివేదిక అంచనా. మహిళా ఉద్యోగుల సంఖ్య పెరిగినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగవుతుందన్న విషయాన్ని ఈ నివేదిక స్పష్టం చేసింది. భారత ఆర్థిక వ్యవస్థపై మహిళల ప్రభావం 17 శాతం ఉంది. అదే ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 37 శాతానికి పైగా స్త్రీలు దీనిపై ప్రభావం చూపుతున్నారు. స్త్రీ, పురుష వ్యత్యాసం లేకుండా కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పించడం ద్వారా సమస్యకు చెక్ పెట్టవచ్చని మెక్ నీ రిపోర్టు సూచిస్తోంది.

  • Loading...

More Telugu News