: చెత్త కుప్పలోని పసికందుపై శునకం ప్రేమ!
తన పేగు తెంచుకుని పుట్టిన శిశువును మానవత్వం లేని ఆ తల్లి చెత్తకుప్పలో పారేసి విదిలించుకుని పోతే... ఆ శిశువుపై ప్రేమ చూపిస్తూ దానిని నోట కరచుకుని తీసుకెళ్లిన ఓ శునకం కథ ఇది. నోరున్న ఈ సమాజానికి నోరులేని ఆ మూగజీవి చూపిన ప్రేమబంధం ఉదంతాన్ని సౌదీ అరేబియాలోని ఓ దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. ఆ శిశువును ఏ మహా తల్లి కన్నదో తెలియదు. ఆ రోజుల బిడ్డను చెత్తకుప్పలో పడేసి వెళ్లిపోయింది. అది గమనించిన ఓ శునకం ఆ శిశువును నోట కరచుకుని తీసుకువెళ్లి ఒక ఇంటిముందు ఉంచింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే ఆ బిడ్డను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఆ పత్రికలో ప్రచురించలేదు. కేవలం ఫోటోలను మాత్రమే ప్రచురించారు. రెండురోజుల క్రితం విడుదల చేసిన ఈ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. తన జాతి కాని జాతి బిడ్డపై ఆ శునకానికున్న ప్రేమను ప్రశంసిస్తూ... కనికరం లేని ఆ బిడ్డ తల్లిని తెగుడుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.