: కూతురు హత్య కేసులో స్వర పరీక్షకు అంగీకరించిన ఇంద్రాణి
కుమార్తె షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియాకు సీబీఐ అధికారులు స్వర పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు ఫోన్ కాల్స్ లోని ఆమె గొంతును నిర్ధారించేందుకు అధికారులు అనుమతి కోరగా కోర్టు అంగీకరించింది. అయితే జైలు విధివిధానాల ప్రకారమే స్వర పరీక్ష నిర్వహించాలని సూచించింది. ఈ నేపథ్యంలో సీబీఐ వినతిని ఇంద్రాణికి వెల్లడించగా మొదట ఆమె అభ్యంతరం తెలిపింది. తరువాత ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కవితా పటేల్ ఆమె సందేహాలు తీర్చి, కేసు దర్యాప్తుకు అవసరమని చెప్పారు. దాంతో లిఖిత పూర్వకంగా స్వర పరీక్షకు ఇంద్రాణి అనుమతి తెలిపింది.