: నియంతలు మీడియాను ఏమీ చేయలేరు: నాగం
ఏబీఎన్ ప్రసారాలను తెలంగాణలో వెంటనే పునరుద్ధరించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై పలువురు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీడియాను నియంతలు తమ చెప్పుచేతల్లో పెట్టుకోలేరనే విషయం సుప్రీం తీర్పుతో స్పష్టమయిందని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ధైర్యంగా నిలబడి, దమ్మున్న ఛానల్ గా ఏబీఎన్ నిరూపించుకుందని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ, సుప్రీం తీర్పు చారిత్రాత్మకం అని తెలిపారు. భేషజాలకు పోకుండా ఇప్పటికైనా ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను కాపాడాలని సూచించారు. ఏబీఎన్ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని అన్నారు.