: ముష్టి వేసినట్టు కాపులకు రూ. 100 కోట్లు ఇవ్వడం సమంజసమా?: వాసిరెడ్డి పద్మ


కాపులకు రూ. వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పిన టీడీపీ ప్రభుత్వం... ముష్టి వేసినట్టు రూ. 100 కోట్లు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని వైకాపా అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను పారిశ్రామికవేత్తలకు 99 ఏళ్ల పాటు లీజుకు ఇస్తున్నారని మండిపడ్డారు. పేద రైతులకు కూడా 99 ఏళ్లకు లీజుకు ఇస్తారా? అని ప్రశ్నించారు. సామాన్యులను పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం... పారిశ్రామికవేత్తలకు మాత్రం రెడ్ కార్పెట్ పరుస్తోందని విమర్శించారు. ఏపీ కేబినెట్ సమావేశంలో కూడా రాష్ట్ర సమస్యలపై చర్చించలేదని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News