: సరిహద్దు వద్ద ఎదురుచూస్తున్న 300 మంది ‘పాక్’ ముష్కరులు!


ఎల్ఓసీ వద్ద 300 మంది పాకిస్థాన్ ముష్కరులు భారత్ లోకి చొరబడేందుకు కాపు కాస్తున్నారని శ్రీనగర్ లోని జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీఓసీ), లెఫ్టినెంట్ జనరల్ సతీష్ దువా వెల్లడించారు. ఈ విషయమై తమకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతోందన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను భారత్ లోకి చొరబడాలంటూ వారిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉన్నట్లు తమకు తెలిసిందని సతీష్ దువా చెప్పారు. అయితే, ముష్కరులు మన భూభాగంలోకి చొరబడటం అంత తేలిక కాదని, ఉగ్రవాదులను అడుగుపెట్టనివ్వకుండా పకడ్బందీ గస్తీ ఉందని అన్నారు. దీంతో అవకాశం దొరికితే భారత్ లోకి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారన్నారు. కొన్ని సందర్భాలలో వారు కాల్పులకు పాల్పడి వెనుదిరుగుతున్నారన్నారు. కాగా, పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడటంతో నిన్న భారత జవాన్లు ఇద్దరు వీరమరణం పొందారు. రెచ్చగొట్టే విధంగా కాల్పులకు పాల్పడుతున్న పాకిస్థాన్ తీరును మార్చుకోవాలని మన నేతలు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News