: పార్లమెంటు ఎదుట కాంగ్రెస్ భారీ ర్యాలీ
భారత దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న మత అసహనంపై ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. గాంధీ విగ్రహం నుంచి పార్లమెంటు వరకు సాగిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు పాలుపంచుకున్నారు. ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మాజీ మంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ఇన్ఛార్జీలు, నేతలు కార్యకర్తలు భారీ ఎత్తున పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రజల్లో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని బీజేపీ కుట్రపన్నుతోందంటూ పలువురు వ్యాఖ్యానించారు.