: రైల్లో టపాసులు తీసుకెళ్తే పది వేల జరిమానా
దీపావళి టపాసుల తయారీకి తమిళనాడు ప్రసిద్ధి. ఆ రాష్ట్రంలోని శివకాశి, అరక్కోణం వంటి ప్రాంతాల్లో పెద్దఎత్తున మందుగుండు సామగ్రి తయారు చేసి, దేశంలోని వివిధ ప్రాంతాలకు రైళ్లలో తరలిస్తారు. అయితే ఈసారి ప్రమాద రహిత దీపావళి జరుపుకోవాలంటూ బస్సులు, రైళ్లలో దీపావళి టపాసులు తీసుకెళ్లడాన్ని తమిళనాడు ప్రభుత్వం నిషేధించింది. రైళ్లలో టపాసులు తీసుకెళ్తూ పట్టుబడితే పది వేల రూపాయల జరిమానా విధిస్తామని అధికారులు తెలిపారు. అరక్కోణం, కాట్పాడి, జాలర్ పేట మీదుగా వెళ్లే రైళ్లలో నిఘా పెంచడంతోపాటు, భద్రతను కట్టుదిట్టం చేశారు.