: ఆటోలో షికారు చేసిన వసుంధర రాజే


బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, చాంతాడంత కాన్వాయ్, మందీ మార్బలం... ముఖ్యమంత్రి అంటే ఇంత ఆర్భాటం ఉంటుంది. అయితే, ప్రతి రోజూ ఈ రాజభోగాలు అనుభవించి బోర్ కొట్టిందో, లేక కాస్త ఛేంజ్ కోరుకున్నారో తెలీదు కానీ... రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఈరోజు ఆటో ఎక్కారు. రకరకాల బొమ్మలను అందంగా చిత్రీకరించిన తెల్లటి ఆటోలో ఆమె ప్రయాణించారు. అనంతరం తన సంతోషాన్ని ఆమె ట్విట్టర్లో పంచుకున్నారు. 'ఇలాంటి అందమైన ఆటోల్లో ప్రయాణించి, మజాను ఆస్వాదించండి' అని కామెంట్ చేశారు. అంతేకాకుండా, జైపూర్ లో ఇలాంటి అందమైన ఆటోలను చూసినట్లైతే వాటి ఫొటోలను 'ఆర్ట్ ఆన్ వీల్స్' అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేయాలని కోరారు. ఆమె పిలుపుకు మంచి స్పందన కూడా వస్తోంది. Vasundhara Raje @VasundharaBJP My wonderful ride today -- when you catch these beautiful autos in Jaipur, tweet back with pictures! #ArtOnWheels

  • Loading...

More Telugu News