: తమిళనాట ఆందోళనకు నడుం బిగించిన తెలుగు విద్యార్థులు


తమిళనాట తెలుగు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమిళనాడులో విద్యనభ్యసించే ప్రతి ఒక్కరూ విధిగా తమిళం నేర్చుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలుగు విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు. మాతృభాషను మర్చిపొమ్మని ఎలా అడుగుతారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై తెలుగు రాష్ట్రాలు స్పందించకపోవడంతో, భాషపై మమకారంతో వారే పోరాటం ఆరంభించారు. గతంలో భాషాభిమానులు చెన్నైలో ఆందోళనలు నిర్వహించి, అక్కడి ప్రభుత్వానికి తెలుగు భాషపై మమకారాన్ని చాటి చెప్పారు. ఈ క్రమంలో తమిళనాట ఉన్న తెలుగు సంఘాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి తమకు బాసటగా నిలవాలని విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు తెలుగు భాషపై నిషేధం సరికాదని లేఖ రాసి సరిపెట్టుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమిళనాట నిరసన దీక్షకు ఏర్పాట్లు చేసినట్టు వార్తలొచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో తెలుగు భాష ఉనికిని రక్షించుకునేందుకు తమిళనాట స్థిరపడిన తెలుగు విద్యార్థులే నడుం బిగించడం విశేషం.

  • Loading...

More Telugu News