: పత్తి మద్దతు ధర పెంచాలని విజ్ఞప్తి చేశా: మంత్రి హరీష్ రావు


పత్తికి మద్దతు ధర రూ.4,100 నుంచి రూ.5 వేలకు పెంచాలని కేంద్ర జౌళిశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ పాండాను కోరానని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న హరీష్ రావు కేంద్ర జౌళిశాఖ కార్యదర్శితో ఈ రోజు సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని పత్తి రైతు సమస్యలను సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. వారంలో మూడు రోజులు మాత్రమే పత్తిని కొనుగోలు చేస్తున్నారని, ఐదు రోజులు పత్తి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరినట్టు హరీష్ వెల్లడించారు. గత ఏడాది ఈ సమయానికి లక్ష క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారని, ఈ ఏడాది 15 వేల క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేశారని అన్నారు. 84 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ 45 కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేశారని తెలిపారు. కొనుగోలు చేసే పత్తి తేమ శాతాన్ని 12 నుంచి 20 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేసినట్లు హరీష్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News