: అవార్డులు వెనక్కి ఇవ్వడాన్ని తప్పుబట్టిన కమలహాసన్
దేశంలో మత అసహనం నెలకొందని ఆరోపిస్తూ పలువురు రచయితలు, సినీ ప్రముఖులు తమకు వచ్చిన జాతీయ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ స్పందించారు. జాతీయ అవార్డులను వెనక్కి ఇవ్వడాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లోను సమర్థించనని స్పష్టం చేశారు. తనకు వచ్చిన అవార్డులను వెనక్కి ఇవ్వనని చెప్పారు. తన తాజా చిత్రం 'చీకటిరాజ్యం' ప్రమోషన్ లో భాగంగా నేడు హైదరాబాద్ లో కమల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. 'చీకటిరాజ్యం' సినిమా తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 12న రిలీజ్ కాబోతోంది.