: రేవంత్ రెడ్డి ఓ బ్రోకర్: మంత్రి జోగు


టీటీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ అటవీశాఖ మంత్రి జోగు రామన్న తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. 'రేవంత్ ఓ బ్రోకర్, ఓ జోకర్' అంటూ ధ్వజమెత్తారు. రైతుల ధర్నా పేరుతో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని మండిపడ్డారు. రానున్న రోజుల్లో ప్రజలే రేవంత్ కు బుద్ధి చెబుతారని అన్నారు. రేవంత్ పై చట్టపరమైన చర్యలు తీసుకునే విషయమై ఆలోచిస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News