: ఒకడికి బులెట్ తగిలింది!... పోలీసుల విస్తృత గాలింపు
నిన్న వనస్థలిపురం సమీపంలో జరిగిన చైన్ స్నాచింగ్ యత్నం, ఆపై పోలీసుల కాల్పుల ఘటనలో ఓ దుండగుడికి బులెట్ గాయం అయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలి నుంచి దొంగలు వెళ్లిన వైపు అందుబాటులో ఉన్న అన్ని సీసీ కెమెరాలనూ పరిశీలించిన పోలీసులు వారు ఆటోనగర్, చింతల్ కుంట, సాగర్ రింగు రోడ్డు, కర్మన్ ఘాట్ మీదుగా కంచన్ బాగ్ వైపు వెళ్లినట్టు సమాచారం లభించింది. దీంతో ఆ చుట్టుపక్కల అన్ని ఆసుపత్రులకు సమాచారం ఇచ్చిన పోలీసులు బులెట్ గాయాల వంటి వాటికి ఎవరైనా చికిత్సకు వస్తే తమకు చెప్పాలని ఆదేశించారు. వారు ఉండవచ్చని అనుమానిస్తున్న అన్ని అసుపత్రుల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు.