: ఏపీలో 'పంచారామ దర్శిని' పేరిట ప్రత్యేక బస్సులు


ఆంధ్రప్రదేశ్ లో 'పంచారామ దర్శిని' పేరిట ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గుంటూరు రీజియన్ లోని 12 డిపోల నుంచి పలు ప్రాంతాలకు బస్సులు నడపనున్నారు. ప్రతి శనివారం, ఆదివారం కార్తీక పౌర్ణమి రోజు పంచారామాలకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ఒకే రోజులో ప్రసిద్ధ త్రిశైవ క్షేత్రదర్శనం పేరిట మరో ప్యాకేజీ అందుబాటులోకి తెస్తున్నామని ఆర్ఎం శ్రీహరి తెలిపారు. ఈ క్రమంలో యాగంటి, మహానంది, శ్రీశైలం ఆలయాల సందర్శన చేసుకోవచ్చన్నారు. ఇక కార్తీకమాసంలో కోటప్పకొండ, శ్రీశైలం, సూర్యలంకకు ప్రత్యేకబస్సులు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News