: తడిసిమోపెడవుతున్న ఏపీ మంత్రులు, అధికారుల బెజవాడ పర్యటనల ఖర్చు!


రాష్ట్ర విభజన జరిగిపోయింది. రాజధాని లేమితో కొట్టుమిట్టాడుతున్న అవశేష ఆంధ్రప్రదేశ్ కు పాలన ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. అసలే ఆర్థిక లోటు, ఆపై అనవసర ఖర్చులతో ఏపీ ఆర్థిక పరిస్థితి నానాటికీ విషమ పరిస్థితిలోకి వెళ్లిపోతోంది. అసలు అనవసర ఖర్చులేంటనే విషయాన్ని పరిశీలిస్తే... పదేళ్ల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగానే ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల ఇప్పటికే ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విజయవాడ నుంచే పూర్తి స్థాయిలో పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆయన హైదరాబాదు రావడమే అరుదుగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాదులో ఉంటూ విధులు నిర్వహిస్తున్న సీనియర్ అధికారులు, మంత్రులు నిత్యం విజయవాడ- హైదరాబాదుల మధ్య చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. దీంతో ఈ ప్రయాణ ఖర్చులు ప్రభుత్వానికి పెను భారంగానే పరిణమిస్తున్నాయి. గడచిన ఏడాది కాలంలో ఈ తరహా ఖర్చుల కింద రూ.45 కోట్లు ఆవిరైపోయాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం ప్రారంభమైతే ఈ ఖర్చు మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు. దీంతో ఈ ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రభుత్వం వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News