: వైకాపా వరంగల్ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్


వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని వైకాపా ప్రకటించింది. నల్లా సూర్యప్రకాశ్ ను తమ అభ్యర్థిగా నిలబెడుతున్నామని తెలంగాణ వైకాపా అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ రోజు హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో సూర్యప్రకాశ్ పేరును మీడియా సమక్షంలో ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనే తాము ప్రచారాస్త్రాలుగా వాడుకుంటామని శ్రీనివాసరెడ్డి తెలిపారు. సూర్యప్రకాశ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని వరంగల్ లోక్ సభ నియోజకవర్గ ఓటర్లను కోరారు. వైకాపాపై కొందరు చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని... వాటిని ప్రజలు నమ్మరని చెప్పారు.

  • Loading...

More Telugu News