: జల్లికట్టు ఆడుకునేందుకు ప్రభుత్వం అనుమతివ్వాలి: సినీ నటుడు కమలహాసన్


జల్లికట్టు ఆడుకునేందుకు అనుమతివ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని సినీ నటుడు కమల్ హాసన్ కోరారు. జల్లికట్టు ఓ ఆటేనని, జంతువులను హింసించడం ఈ ఆట ఉద్దేశం కాదని పేర్కొన్నారు. జల్లికట్టు అంటే ఎద్దుల్ని ఆట పట్టించడం తప్ప... దాన్ని భౌతికంగా ఇబ్బంది పెట్టడం కాదని కమల్ అభిప్రాయపడ్డారు. చెన్నైలో జల్లికట్టుపై ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కమల్ ప్రారంభించారు. ఈ సందర్భంగానే ఆయన పైవిధంగా మాట్లాడారు. స్పెయిన్, ఇటలీ దేశాల్లో బుల్ గేమ్ వల్ల జంతువులకు హాని జరిగే అవకాశం ఉందని, కానీ మన దేశంలో అలాంటి పరిస్థితి లేదని అన్నారు. జల్లికట్టు ద్వారా ఓ వ్యక్తి శారీరక సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చని చెప్పారు. సంక్రాంతి పండుగ సమయంలో తమిళనాడులో జల్లికట్టును ఆడతారు. ప్రస్తుతం దానిపై సుప్రీంకోర్టు నిషేధం అమల్లో ఉంది.

  • Loading...

More Telugu News