: మధ్యాహ్నం వైకాపా వరంగల్ అభ్యర్థి పేరు వెల్లడి


వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక అభ్యర్థి పేరును ఈ మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటించనున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి పేరును పార్టీ అధినేత జగన్ ఇప్పటికే ఎంపిక చేశారు. అభ్యర్థి పేరును తెలంగాణ వైకాపా అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించనున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా సిరిసిల్ల రాజయ్య, టీఆర్ఎస్ తరపున పసునూరి దయాకర్, వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గాలి వినోద్ కుమార్ లు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీయే అభ్యర్థిగా దేవయ్య నామినేషన్ వేయనున్నారు.

  • Loading...

More Telugu News