: డివిలియర్స్ కు బ్రహ్మరథం పట్టిన భారత అభిమానులు... మొహాలీలో గ్రాండ్ వెల్ కమ్!


భారత్ పై తనదైన శైలిలో విరుచుకుపడిన సఫారీ వన్డే జట్టు కెప్టెన్ ఏబీ డివిలియర్స్ కు నిన్న మొహాలీలో ఘన స్వాగతం లభించింది. టీమిండియాకు ప్రత్యర్థే అయినా, అతడికి భారత క్రికెట్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఫ్రీడమ్ సిరీస్ లో మొన్న ముగిసిన వన్డే పోరులో డివిలియర్స్ అసమాన ప్రతిభతో టైటిల్ టీమిండియా చేజారింది. సగటు భారత క్రికెట్ అభిమానికి నిద్ర లేని రాత్రులను మిగిల్చిన డివిలియర్స్ పై సాధారణంగా వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న భావన కలిగింది. అయితే క్రీడాస్ఫూర్తితో వ్యవహరించిన మొహాలీ వాసులు ఏబీకి గ్రాండ్ వెల్ కమ్ పలికారు. త్వరలో మొదలు కానున్న టెస్టు సిరీస్ కోసం నిన్న సఫారీ జట్టు మొహాలీ చేరుకుంది. జట్టు సభ్యులతో కలిసి మొహాలీ చేరుకున్న ఏబీకి అక్కడి ఫ్యాన్స్ జేజేలు పలికారు. జట్టు బస చేయనున్న హోటల్ లాబీల్లోకి ఏబీ అడుగుపెట్టగానే అక్కడ డివిలియర్స్ నినాదాలు హోరెత్తాయి.

  • Loading...

More Telugu News