: ‘బాహుబలి’ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ 50 వేలు... చిత్ర బృందం కృతఙ్ఞతలు


'బాహుబలి' ఇన్ స్టాగ్రామ్ అభిమానులకు ఆ చిత్ర బృందం కృతఙ్ఞతలు తెలిపింది. ఈ మేరకు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొంది. బాహుబలి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో మొత్తం 50 వేల మంది అభిమానులు చేరారు. ఈ సందర్భంగా బాహుబలి చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాహుబలి చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా, బాహుబలి-2 కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాహుబలి-3 కూడా ఉంటుందని ఇటీవల రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News