: పాలాభిషేకంతో మరో వివాదం రేపిన బీజేపీ
ఇటీవల తమ వ్యాఖ్యలతో వివాదాలు రేపుతున్న బీజేపీ నేతలు ఈసారి తమ చేష్టలతో వివాదం రేపారు. గోవాలోని కానకోనా మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మూడో వార్డు నుంచి కౌన్సిలర్ గా పోటీ చేసిన కిశోర్ శేఠ్ విజయం సాధించారు. అక్టోబర్ 27న ఆయన విజయం సాధించినట్టు ప్రకటన ఏర్పడగానే, ఆయన అనుచరులు ఆయనకు పాలాభిషేకం చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు రేగాయి. దేశంలో ఓపక్క ప్రజలు పాలు కొరతను ఎదుర్కొంటుండగా, బీజేపీ నేతలు పాలను వృథా చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ విమర్శలపై ఆ కౌన్సిలర్ నేడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయోత్సాహంలో మాత్రమే అలా చేశారని, భారత్ లో ఉన్న సుప్రసిద్ధ సంప్రదాయాన్ని పాటించారని, అందులో తప్పులేదని ఆయన వ్యాఖ్యానించారు.