: విజయనగరంలో ప్రబలిన ‘అతిసారం’
విజయనగరం జిల్లాలో అతిసార వ్యాధి ప్రబలటంతో సుమారు 16 మంది అస్వస్థతకు గురయ్యారు. డెంకాడ మండలంలోని చొల్లంగిపేట పంచాయతీ పరిధిలో ఉన్న గొల్లపేటలో అతిసార వ్యాధి కారణంగా గ్రామస్తులు మూలనపడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న వైద్య సిబ్బంది ఆ గ్రామానికి చేరుకుని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించింది. భోగాపురం ఆరోగ్య కేంద్రంలో కూడా కొంతమంది రోగులు చికిత్స పొందుతున్నారు. వైద్యాధికారులు మాట్లాడుతూ, గ్రామంలో ‘అతిసార’ తగ్గుముఖం పట్టేవరకూ వైద్య శిబిరం కొనసాగిస్తామని చెప్పారు.