: మోదీ తక్కువ మాట్లాడి...ఎక్కువ పని చేయాలి: రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోదీ తక్కువ మాట్లాడి, ఎక్కువ పని చేయాలని కాంగ్రెస్ ఉపాథ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. సిక్కుల ఊచకోతకు కాంగ్రెస్ కారణమని పేర్కోవడంపై రాహుల్ మండిపడ్డాడు. దీనిపై పాట్నాలో ఆయన మాట్లాడుతూ, మోదీ నుంచి దేశం చాలా ఆశించిందని అన్నారు. మోదీ కూడా చాలా హామీలిచ్చారు. వాటిని అమలు చేస్తే బాగుంటుందని అన్నారు. మోదీ తానొక్కరే దేశాన్ని నడిపించాలని కోరుకుంటున్నారు. ఇది అందరి దేశం అని, దేశాభివృద్ధిలో అందరినీ కలుపుకుని పోవాలని ఆయన సూచించారు. బీహార్ లో బీజేపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ గ్రహించిందని ఆయన తెలిపారు. బీజేపీదైనా, ఆర్ఎస్ఎస్ దైనా 'విభజించి పాలించు' నినాదమే అజెండా అని ఆయన తెలిపారు.