: ఈ ఆహారంతో నికోటిన్ దుష్పరిణామాలకు చెక్ !


నికోటిన్ తో తయారయ్యే సిగిరెట్లు తాగడానికి అలవాటుపడ్డ వారు దాని నుంచి బయటపడటం అంత తేలిక కాదు. నికోటిన్ మత్తుకు బానిసైతే అనారోగ్యం పాలై ఎంతో నష్టపోతాము. నరాలు, కండరాలు పనితీరుపై దాని ప్రభావం చూపడంతో వాటి పనితీరు మందగించి, క్రమంగా మనం మూలనపడేలా చేస్తుంది. కొన్ని పొగాకు ఉత్పత్తులను నోటి ద్వారా లోపలికి తీసుకునే వారు ఉన్నారు. కాకపోతే, పొగతాగే వారిలో కన్నా వీరిపై నికోటిన్ దుష్పరిణామం కొంత తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నికోటిన్ కారణంగా శరీరంలో చోటుచేసుకునే దుష్పరిణామాల బారి నుంచి బయటపడేందుకు, దాని ప్రభావం లేకుండా ఉండేందుకు కొన్ని ఆహార అలవాట్లు తప్పనిసరిగా చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పాలకూర, క్యారెట్, బ్రొకోలి, క్యాబేజ్ లాగా ఉండే కాలె, అల్లం, నిమ్మకాయలు, గోధుమ, ఆరెంజ్, దానిమ్మకాయలు, క్రాన్ బెర్రీస్ ను సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News