: పాక్ లో ఆరుగురు ఉగ్రవాదుల హతం


పాకిస్థాన్ లో ఆరుగురు ఉగ్రవాదులను అక్కడి పోలీసులు మట్టుబెట్టారు. గత రాత్రి పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురెదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు ముష్కరులు హతమయ్యారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటన బాల్టిస్థాన్ ప్రావిన్స్ లోని కలత్ జిల్లా జోహన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. చనిపోయిన ఉగ్రవాదులకు పలు బాంబు పేలుళ్ల ఘటనలతో సంబంధముందని పోలీసులు నిర్ధారించారు. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ముష్కరులపై దాడులు కొనసాగుతాయని తెలిపారు.

  • Loading...

More Telugu News