: న్యూయార్క్ చేరుకున్న సచిన్, వార్న్


మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఆసీస్ దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ న్యూయార్క్ చేరుకున్నారు. నవంబర్ 7 నుంచి అమెరికాలో ప్రారంభం కానున్న ఆల్ స్టార్స్ క్రికెట్ టోర్నీలో పాల్గొనేందుకు వీరిద్దరూ న్యూయార్క్ చేరుకున్నారు. అమెరికాలో క్రికెట్ కు ఆదరణ కల్పించేందుకు, దిగ్గజ క్రికెటర్లతో ఓ టోర్నీని సచిన్, వార్న్ కెప్టెన్లుగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. న్యూయార్క్, హూస్టన్, లాస్ ఏంజిలెస్ లలో మూడు టీట్వంటీ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ లలో రిటైర్ అయిన దిగ్గజ క్రికెటర్లు 24 మంది పాలుపంచుకోనున్నారు. ఈ మ్యాచ్ లకు అమెరికాలో ఆదరణ లభిస్తుందని వీరు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News