: ఇంత 'చోటా' అనుకోలేదు: రాంగోపాల్ వర్మ


తనదైన శైలిలో ఎవరో ఒకరిపై ట్వీట్లు చేస్తూ, నిత్యమూ వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ దృష్టి ఈసారి చోటా రాజన్ పై పడింది. చోటా రాజన్ బాలీలో పట్టుబడిన సమయంలో తీసిన ఓ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో ఉంచుతూ, "చోటా రాజన్ ఇంత 'చోటా' అవుతాడని ఎన్నడూ అనుకోలేదు" (Never thought Chota Rajan can become so Chota) అని వ్యాఖ్యానించాడు. ఈ మధ్యాహ్నం 3:27 గంటల సమయంలో వర్మ ట్వీట్ చేయగా, పలువురు దాన్ని షేర్ చేసుకోగా, మరికొందరు రీట్వీట్లు చేశారు.

  • Loading...

More Telugu News