: ప్రపంచంలో 'పర్ ఫెక్ట్ సెల్ఫీ'లు ఇవే!


సెల్ఫీల హవా మొదలైనప్పటి నుంచీ పలురకాలుగా ఎంతోమంది సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఎవరికివారు తమ సెల్ఫీయే బాగుందని అనుకుంటారు. మరసలు సెల్ఫీ అంటే ఎలా ఉండాలి?, ఏ సైజులో ఉండాలో స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీకి చెందిన ఓ పరిశోధకుడు కనుగొన్నాడు. వర్సిటీలోని కంప్యూటర్ విజన్ ల్యాబ్ లో ఆంద్రెజ్ కార్పతి అనే పరిశోధకుడు న్యూరల్ నెట్ వర్క్ కంప్యూటర్ ను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది దిగిన సెల్ఫీలను విశ్లేషించాడు. సెల్ఫీ ఫోటో నాణ్యత, కోణం, లైటింగ్ తదితర అంశాలను ఈ కంప్యూటర్ పరిగణనలోకి తీసుకుంది. దాంతో ఒక్కో సెల్ఫీకి ఒక స్కోర్ ఇచ్చింది. ఆ సెల్ఫీల్లో కొద్దిగా తలను వంచి నుదుటి పైభాగం కొంతమేర ఫ్రేమ్ లో కట్ అయ్యేలా ఓ యువతి దిగిన సెల్ఫీకి 69.6 స్కోరు ఇచ్చింది. కాబట్టి ఆ ఫోటోయే 'పర్ ఫెక్ట్ సెల్ఫీ'గా ఎంపికైంది. అంతేగాక మహిళలు దిగిన ఫోటోలనే ఈ కంప్యూటర్ అత్యుత్తమమైన సెల్ఫీలుగా గుర్తించింది.

  • Loading...

More Telugu News