: ఫేస్ బుక్, ట్విట్టర్ జోలికెళ్లారో..జాగ్రత్త...పిల్లలకు కేట్ విన్ స్లెట్ అల్టిమేటం


సామాజిక మాధ్యమాలు ఫేస్ బుక్, ట్విట్టర్ జోలికి వెళ్లవద్దని ప్రముఖ హాలీవుడ్ నటి కేట్ విన్ స్లెట్ తన పిల్లలకు అల్టిమేటం జారీ చేసింది. సామాజిక మాధ్యమాలు అస్తిత్వాన్ని చంపేస్తాయని ఆమె పేర్కొంది. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ప్రభావం వారి సహజ లక్షణాలపై ప్రభావం చూపుతాయని ఆమె అభిప్రాయపడింది. టీనేజ్ పిల్లల్లో సామాజిక మాధ్యమాలు గణనీయమైన ప్రభావం చూపుతాయని, దాని మాయలో పడి తమకు ఏం కావాలనే విషయాన్ని మర్చిపోతున్నారని, వారి ఆహారపుటలవాట్లలో కూడా మార్పులు సంభవిస్తాయని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియా తన కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండేందుకు తానీ చర్యలు తీసుకున్నట్టు ఆమె తెలిపారు. కాగా, కేట్ పిల్లల పేర్లు మియా, జో.

  • Loading...

More Telugu News