: రంగా హత్య గురించి ముందే తెలిస్తే ఇంతకాలం నోరెందుకు మూసుకున్నావ్?: హరిరామ జోగయ్యపై గాలి మండిపాటు
వైకాపా నేత హరిరామజోగయ్యపై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వంగవీటి రంగా హత్య గురించి ఆయనకు ముందే తెలిసి ఉంటే ఇంతకాలం నోరు మూసుకుని ఎందుకున్నారని మండిపడ్డారు. తాను రాసుకున్న పుస్తకానికి పబ్లిసిటీ చేసుకునేందుకే జోగయ్య వివాదాస్పద అంశాలను ఎంచుకున్నారని విమర్శించారు. రంగా హత్య అనేది రెండు కుటుంబాల మధ్య గొడవ వల్ల జరిగిందని... ఆయన హత్యకు, టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. రాష్ట్రంలో ఉనికిని కాపాడుకునేందుకే వైకాపా ధర్నాలు చేస్తోందని గాలి ఆరోపించారు. ఏపీలోని 13 జిల్లాలను విచ్ఛిన్నం చేయాలని వైకాపా నేతలు కంకణం కట్టుకున్నారని విమర్శించారు.