: అక్టోబరులో 'ఉత్పత్తి' బేలచూపులు!


ఇండియాలో ఉత్పత్తి రంగంలో వృద్ధి దాదాపు రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. గడిచిన అక్టోబర్ నెలలో మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ వృద్ధి రేటు 22 నెలల కనిష్ఠస్థాయిలో నిలిచింది. నిక్కీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ 'పీఎంఐ' (పర్చేజ్ మేనేజింగ్ ఇండెక్స్) అక్టోబరు నెలలో 50.7 శాతానికి చేరుకుంది. కాగా, ఉత్పాదక రంగం కుంటుపడినప్పటికీ, పరిశ్రమలు అదనంగా కార్మికులను నియమించుకోవడంలో ముందున్నాయని, జనవరి తరువాత ఉద్యోగ నియామక జోరు ఇప్పుడే కనిపిస్తోందని తెలిపింది. అంతకుముందు సెప్టెంబరు నెలలో పీఎంఐ 51.2 శాతంగా నిలువగా, ఆపై మాన్యుఫాక్చరింగ్ సెక్టారులో వృద్ధి అవకాశాలు మరింతగా దెబ్బతిన్నాయన్న విషయాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. కొత్త సంస్థలు తగ్గడంతోనే మందగమనం కనిపిస్తోందని ఆర్థికవేత్తలు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News