: ప్రత్యేక హోదా కోసం పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తే సహించం: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి
ప్రత్యేక హోదా కోసం ఏపీలోని పలు చోట్ల విద్యార్థులు చేస్తున్న నిరసన, ధర్నాలపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ కిషోర్ కొద్దిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదాపై ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపితే తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. అలాగని పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తే సహించేది లేదని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించారు. ఈ విషయంలో విపక్షాలు కూడా విద్యార్థులకు మద్దతు పలకడం విచారకరమన్నారు. పోలీసులు తమకు రక్షణ కల్పించాలని, లేకపోతే తమకు తామే రక్షణ కల్పించుకుంటామని చెప్పారు. ప్రత్యేక హోదా ఏమీ తారకమంత్రం కాదన్న శ్యామ్ కిషోర్, రాష్ట్ర అభివృద్ధికి మోదీ, వెంకయ్యనాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు.