: విజయవాడ వచ్చేందుకు ఏపీ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు: మంత్రి యనమల


విజయవాడ రావడానికి ఏపీ ఉద్యోగులు సిద్దంగా ఉన్నారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. అయితే విద్యాసంవత్సరం మధ్యలో ఉన్నందున అందరూ ఒకేసారి రావటానికి ఇబ్బంది ఉంటుందన్నారు. అంతేగాక రెయిన్ ట్రీ పార్కులో మంత్రులు, అధికారుల నివాసాలు ఏర్పాటు చేయనున్నామని, నివాస సముదాయానికి ఉపసంఘం సంసిద్ధత వ్యక్తం చేసిందని వెల్లడించారు. దానిపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇక ఇతర ఉద్యోగులకు వసతి సదుపాయం అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఉద్యోగుల స్థానికత, కార్యాలయాల తరలింపుపై మంత్రి యనమలతో బాటు ఉన్నతాధికారులతో కూడా సీఎం చంద్రబాబు సమావేశమై చర్చించారు. అనంతరం యనమల మీడియాతో మాట్లాడారు. స్థానికత అంశంపై సీఎంతో చర్చించామన్నారు. దానిపై రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News