: పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లోని గ్రామాల్లో 100 వైఫై హాట్ స్పాట్స్... స్పాన్సరర్ గా ఫేస్ బుక్!


కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'డిజిటల్ ఇండియా'కు ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్ సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ దేశంలోని పశ్చిమ, దక్షిణ రాష్ట్రాల్లోని గ్రామాల్లో ఏర్పాటు చేసే 100 వైఫై హాట్ స్పాట్స్ కు ఫేస్ బుక్ ఆర్థిక సాయం అందించనుంది. హాట్ స్పాట్స్ కు స్పాన్సర్ గా ఉంటూ ప్రతి ఏడాది రూ.5 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్, ఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. అంటే ప్రతి హాట్ స్పాట్ కు బీఎస్ఎన్ఎల్ అందించే బ్యాడ్ విడ్త్ కు ఏటా ఐదు లక్షల చొప్పున ఫేస్ బుక్ చెల్లిస్తుందని వివరించారు. ఈ మేరకు కుదుర్చుకున్న ఒప్పందంతో ఇప్పటికే 25 హాట్ స్పాట్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ వైఫై హాట్ స్పాట్ కేంద్రాలను క్వాడ్ జెన్ సంస్థ ఏర్పాటు చేసి, నిర్వహిస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News